Good News: జనసేనలోకి భారీగా చేరికలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-18 12:06:56  IST  )

తాడేపల్లిగూడెం జనసేనలోకి భారీగా చేరికలు జరిగాయి..

Good News: జనసేనలోకి భారీగా  చేరికలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన(Janasena)లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ(Ycp) ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ పార్టీ దీనస్థితిని ఎదుర్కొంటోంది. వైసీపీ నుంచి నాయకులు వెళ్లిపోతున్నారు. కూటమి వైపు చూస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీటీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. కొంతమంతి టీడీపీలో చేరగా మరికొందరు జనసేనలో చేరుతున్నారు.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) తాడేపల్లిగూడెం(Tadepalligudem) నియోజకవర్గం పెంటపాడు(Pentapadu)కు చెందిన 8 మంది వైసీపీ ఎంపీటీసీలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పార్టీ జెండా కప్పి మంత్రి కందుల దుర్గేశ్ జనసేనలోకి ఆహ్వానించారు. పెంటపాడు - 3 ఎంపీటీసీ దేవాబత్తుల నాగమణి, నర్సిపురం ఎంపీటీసీ తోట నిరీక్షణరావు, వల్లూరుపల్లి ఎంపీటీసీ దెయ్యం శ్రీనివాసరావు, రాచర్ల ఎంపీటీసీ చెంతన శారద, మేన వల్లూరు ఎంపీటీసీ కె దేవికారాణి, బి. గండేపాడు ఎంపీటీసీ డి సత్యనారాయణ, రావిపాడు ఎంపీటీసీ బొచ్చెల తాతారావు, మొంజిపాడు ఎంపీటీసీ నంద్యాల వెంకన్న బాబు కు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆశయాలు, కూటమి ప్రభుత్వ పని తీరు నచ్చి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన 8 మంది ఎంపీటీసీలు జనసేనలో చేరారని ఆయన తెలిపారు

Next Story