50 శాతం సేంద్రీయ వ్యవసాయం పెంచేందుకు కృషి చేయాలి

by Thanuru Gopichand |

రాష్ట్రంలోని రైతులు వచ్చే ఏడాది నాటికి 50 శాతం సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) పెంచేందుకు కృషి చేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha) అన్నారు.

50 శాతం సేంద్రీయ వ్యవసాయం పెంచేందుకు కృషి చేయాలి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని రైతులు వచ్చే ఏడాది నాటికి 50 శాతం సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) పెంచేందుకు కృషి చేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha) అన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తలపెట్టిన రైతన్నా మీ కోసం పేరుతో జరుగుతున్న రైతు వారోత్సవాల్లో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలం గుడివాడ గ్రామంలో రైతులో ముఖాముఖిని మంత్రి బుధవారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను పరిశీలించారు. వాటిని ఏర్పాటు చేసిన రైతులతో మాట్లాడి స్టాల్స్ గురించిన వివరాలు, ఉత్పత్తుల ప్రత్యేకతను గురించి తెలుసుకున్నారు. . ఈ సందర్భంగా రైతులు, అధికారులు హోం మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం రైతులతో జరిగిన ముఖాముఖిలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరమైన పరిష్కారాలతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

రైతులు దేశానికి వెన్నుముకని మంత్రి అనిత పేర్కొన్నారు. రైతులకు తాము ఉన్నామనే భరోసా ఇవ్వాలని నాయకులు, అధికారులకు సూచించారు. ఎన్డీయే ప్రభుత్వం రైతులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పంట ఉత్పత్తికి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రైతులకు చెప్పారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా, కేవలం 24 గంటల్లో రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. నియోజకవర్గంలోని తమలపాకుల రైతులకు అధికంగా నష్టపరిహారం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు.

Next Story