- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనసాగుతోన్న EE నూనె శ్రీధర్ విచారణ.. ఆ ఉన్నతాధికారికి ఏసీబీ నోటీసులు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నీటి పారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ (EE Sridhar)ను ఏసీబీ (ACB) అధికారులు వరుసగా రెండో రోజు విచారిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నీటి పారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ (EE Sridhar)ను ఏసీబీ (ACB) అధికారులు వరుసగా రెండో రోజు విచారిస్తున్నారు. మొదటి రోజు విచారణలో భాగంగా అత్యంత కీలక విషయాలు అతడి నుంచి రాబట్టినట్లుగా తెలుస్తోంది. సోదాల్లో భాగంగా శ్రీధర్ ఇంట్లో అక్రమాస్తులకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలాంటి లబ్ధి చేకూర్చితే ఇచ్చారు.. లాంటి ప్రశ్నలను సంధిస్తున్నారు. అయితే, శ్రీధర్ కూడబెట్టిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో వందల కోట్లకు పైగా విలువ చేస్తున్నట్లుగా గుర్తించారు. నీటి పారుదల శాఖలో కొంతమంది ఉన్నతాధికారులకు ఆయన బినామీగా ఉన్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఓ ఉన్నతాధికారి విషయంలో ఏసీబీ ప్రశ్నలకు శ్రీధర్ స్పందించనట్లుగా తెలుస్తోంది. సదరు ఉన్నతాధికారికి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం.






