భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి: చంద్రబాబు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-18 15:58:19  IST  )

బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి: చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న 12 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్, అరెంజ్, ఎల్లో అలర్ట్‌లను కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఈ సందర్భంగా వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌తో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సమీక్ష నిర్వహించారు. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని, జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పరిస్థితి తీవ్రతను బట్టి ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలన్నారు. ముందస్తు సన్నద్దతతో, అప్రమత్తతో ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Next Story