- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Magunta Raghava బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టుకు ఈడీ!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తే ఢిల్లీ హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చిందని హైకోర్టు ఉత్తర్వులను గురువారం ఈడీ సవాల్ చేసింది. మధ్యంతర బెయిల్ కోసం మాగుంట రాఘవ చూపిన కారణాలు సరైనవి కావని, సమీప బంధువుల ఆరోగ్యం బాగోలేదని తప్పుడు సమాచారం రాఘవ కోర్టుకు ఇచ్చారని ఈడీ తన పిటిషన్ లో ఆరోపించింది. అందువల్ల హైకోర్టు ఉత్తర్వులపై వెంటనే స్టే ఇవ్వాలని అదనపు సోలిసిటర్ జనరల్ రాజు కోర్టును కోరారు. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ రమేష్ బిందాల్ తో ధర్మాసనం తెలిపింది.
Also Read..
Next Story






