- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ED Raids: మాజీ ఎంపీకి బిగ్ షాక్.. విశాఖలోని పలు ఇళ్లలో ఈడీ సోదాలు
వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana)కు ఈడీ (Enforcement Directorate) అధికారులు బిగ్ షాకిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana)కు ఈడీ (Enforcement Directorate) అధికారులు బిగ్ షాకిచ్చారు. ఈ మేరకు విశాఖపట్నం (Vishakhapatnam)లోని నిర్మాణంలో ఉన్న పలు భవనాల్లో సోదాలు చేపడుతున్నారు. అదేవిధంగా టైకూన్ జంక్షన్ (Tycoon Junction) వద్ద ఉన్న పలు భవనాల్లో అధికారులు రెండు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే, గత సంవత్సరం అక్టోబర్ 19న ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana)కు సంబంధించి విశాఖ (Vishakha)లోని లాసన్స్ బే కాలనీ (Lawson's Bay Colony)లోని ఇల్లు, కార్యాలయంతో పాటు మధురవాడలోని ఎంవీవీ సిటీ (MVV City) కార్యాలయంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా ఆయన వ్యక్తిగత ఆడిటర్ జీవీ (Auditor GV) ఇంట్లో కూడా సోదాలు చేశారు. మధురవాడ (Madhurawada)లో భూమి కొనుగోళ్లకు సంబంధించి తనిఖీలు చేసినట్లుగా అధికారులు స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ మాజీ ఎంపీ ఇంట్లో ఈడీ రెయిడ్స్ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.






