- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్ కెసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్న ఇద్దరు ఈడీ అధికారులు
ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి (Raj Kesireddy) వాంగ్మూలాన్ని ఇద్దరు ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి (Raj Kesireddy) వాంగ్మూలాన్ని ఇద్దరు ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు. విజయవాడ జిల్లా జైల్లో (Vijayawada District Jail) ఉన్న ఆయన్ను పలు ప్రశ్నలడిగిన అధికారులు.. ఈ స్కామ్ లో అతని ప్రమేయంపై వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకలతో వేల కోట్ల రూపాయలు అక్రమ రవాణా జరిగినట్లు సిట్ నిర్ధారించింది. సుమారు రూ.4000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేసింది. మే 2025లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కేసు నమోదు చేసిన ఈడీ.. 33 మందిని నిందితులుగా పేర్కొంది.
కాగా.. ఈ కేసులో తన కొడుకు అరెస్ట్ అక్రమమని ఆయన తండ్రి ఉపేంద్రరెడ్డి, రాజ్ కెసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేసిన పార్థివాలా ధర్మాసనం వాటిని కొట్టివేసింది. కావాలంటే బెయిల్ కోసం పిటిషన్ వేసుకోవచ్చని సూచించింది.






