Liquor Case: ఎంపీ మిథున్‌రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్.. ముగిసిన విచారణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-23 12:59:48  IST  )

లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి స్టేట్ మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. ...

Liquor Case: ఎంపీ మిథున్‌రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్.. ముగిసిన విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case)లో ఎంపీ మిథున్ రెడ్డి(Mp Mithun Reddy) స్టేట్ మెంట్‌ను ఈడీ అధికారులు(Ed Officers) రికార్డు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ ఈడీ కార్యాలయం(Hyderabad Ed Office)లో విచారణకు హాజరైన ఆయనను దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ ద్వారా జరిగిన హవాలా, మనీలాండరింగ్‌పై ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలపైనా ప్రశ్నల వర్షం కురిపించారు.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం..


కాగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former Mp Vijaysai Reddy) సైతం విచారణలో ఈడీ అధికారులకు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని విచారించారు. విచారణ ముగియడంతో ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇక ఈడీ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నంత సేపు వైసీపీ కార్యకర్తలు, ఆయన అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. విచారణ ముగియడం, ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ కార్యాలయం నుంచి బయటకు రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Next Story