Breaking: నంద్యాల SDPI పార్టీ కార్యాలయంలో ఈడీ సోదాలు.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-06 12:03:40  IST  )

నంద్యాల SDPI పార్టీ కార్యాలయంలో హైదరాబాద్‌కు చెందిన ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు...

Breaking: నంద్యాల SDPI పార్టీ కార్యాలయంలో ఈడీ సోదాలు.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల SDPI పార్టీ కార్యాలయం(Nandyal SDPI party office)లో హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ఈడీ అధికారులు(ED Officers)సోదాలు చేస్తున్నారు. SDPI పార్టీ కార్యాలయం మూసి ఉండటంతో బలవంతంగా తెరిపించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈడీ అధికారులను అడ్డుకునేందుకు SDPI నేతలు ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా సరే SDPI కార్యాలయం తలుపులను తెరిచి ఆఫీసులో సోదాలు చేస్తున్నారు.


అయితే నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో SDPIకి సంబంధాలు కలిగివుందన్న అనుమానాల నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే రెండు పార్టీ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించింది. దీంతో SDPI పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎం.జె.ఫైజీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను కస్టడీలోకి తీసుకుని రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలో పలుచోట్ల SDPI కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Next Story