- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. ఆ వివరాలు అందజేయాలని ఈడీ లేఖ
ఏపీ(Andhra Pradesh)లో లిక్కర్ స్కాం కేసు పై ఈడీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో లిక్కర్ స్కాం కేసు పై ఈడీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసు పై విచారణకు ఈడీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన వివరాలు తమకు అందజేయాలని సిట్ చీఫ్, విజయవాడ(Vijayawada) నగర పోలీస్ కమిషనర్ ఈడీ(Enforcement Directorate) తాజాగా లేఖ రాసింది. ఈ క్రమంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002(Anti-Money Laundering Act) ప్రకారం కేసు దర్యాప్తు చేస్తామని ఈడీ లేఖలో పేర్కొంది.
ఈ లిక్కర్ స్కాం కేసు పై సీఐడీ(CID) అధికారులు నమోదు చేసిన FIR వివరాలు ఇవ్వాలని అందులో పేర్కొంది. అలాగే ఈ కేసుతో సంబంధం ఉందని అధికారులు గుర్తించిన వారి బ్యాంక్ అకౌంట్(Bank Account) వివరాలు, ఆస్తుల వివరాలను అందజేయాలని లేఖలో తెలిపింది. అరెస్టైన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు వారిపై ఛార్జ్ షీట్ నమోదు చేసి ఉంటే ఆ కాపీలను అందజేయాలని కోరింది.






