తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం.. రంగంలోకి ఈడీ

by Naga Rani Yarlagadda |

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం.. రంగంలోకి ఈడీ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఇందులోకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంటరయింది. కేసులో భారీ ఆర్థిక అక్రమాలు, మనీలాండరింగ్ జరిగినట్లు సిట్ విచారణలో తేలడంతో PMLA (Prevention of Money Laundering Act) చట్టం కింద కేసు నమోదు చేసింది. వందల కోట్ల రూపాయలు చేతులు మారడంపై ఈడీ విచారణ జరిపి నిజా నిజాలను బయటకు లాగనుంది. మనీ ట్రయల్ పై కూడా ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. 2019 నుంచి 2024 వరకూ టీటీడీకి సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ జరిపిన విచారణలో తేలింది. ఈ నెయ్యి విలువ సుమారు రూ.235 కోట్లు ఉన్నట్లు అంచనా. నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ విచారణ పూర్తి చేసి 36 మందిని ఛార్జిషీటులో నిందితులుగా చేర్చింది. వీరిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపుపై ఈడీ విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో త్వరలోనే కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితులుగా ఉన్నవారికి ఈడీ నోటీసులు జారీ చేసి, విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ విచారణతోనైనా ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story