- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాగునీటి సమస్య తీరెదెన్నడో.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
కాజులూరు మండలం శీల గ్రామంలో దాహర్తితో జనం అల్లాడిపోతున్నారు.

దిశ, రామచంద్రపురం: కాజులూరు మండలం శీల గ్రామంలో దాహర్తితో జనం అల్లాడిపోతున్నారు. దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. నాటి వైసీపీ పాలకులు పట్టించుకోలేదు. కనీసం కూటమి ప్రభుత్వం అయినా స్పందించాలని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో కోరంగి కాల్వ పక్కన బోరు తవ్వారు. ఆయా బోరు నుంచి నీరు రావాలంటే పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఆయా ట్రాన్స్ఫార్మర్ ద్వారా నీరు కుళాయి లోకి వస్తాయి. కానీ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడానికి అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు. గ్రామస్తులు విషయం అనేక సార్లు అడిగినా వారు పట్టించుకోవడం లేదు. ఓ పక్క వేసవి ముదురుతున్న నేపథ్యంలో దాహం తీర్చుకోవడానికి అల్లాడిపోతున్నారు. ఈ మేరకు సర్పంచ్ కోమలి వెంకట రమణ మాట్లాడుతూ అధికారులు తక్షణమే స్పందించాలని లేని పక్షం లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు.






