ఈదురుగాలులకు విరిగిపడిన తాటిచెట్టు.. మహిళ మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-28 09:29:23  IST  )

తాటిచెట్టు విరిగిపడి వీరవేణి (49) అనే మహిళ మృతి చెందింది. ఇంటి బయట నిలబడి..

ఈదురుగాలులకు విరిగిపడిన తాటిచెట్టు.. మహిళ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తుపాను ప్రభావంతో వీస్తున్న ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాకనపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాటిచెట్టు విరిగిపడి వీరవేణి (49) అనే మహిళ మృతి చెందింది. ఇంటి బయట నిలబడి ఉన్న వీరవేణిపై ఈదురుగాలులకు తాటిచెట్టు కూలింది. దీంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అల్లూరి జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ పరిధిలోని నందిగరువు గ్రామంలో ఈదురుగాలులకు ఓ ఇంటి పక్కన ఉన్న చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. విశాఖపట్నంలోని కురుపాం రోడ్డులో భారీ వృక్షం విరిగి పడింది. ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో చెట్టు కూలడంతో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Next Story