AP News:ఆ రోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్?

by Jakkula.Mamatha |

వైద్యసేవల బకాయిల్లో కనీసం రూ.1,500 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని, మిగిలిన బిల్లులకు స్పష్టమైన చెల్లింపు షెడ్యూల్ ఇవ్వాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతినిధుల బృందం డిమాండ్ చేసింది.

AP News:ఆ రోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్?
X

దిశ, కాకినాడ: వైద్యసేవల బకాయిల్లో కనీసం రూ.1,500 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని, మిగిలిన బిల్లులకు స్పష్టమైన చెల్లింపు షెడ్యూల్ ఇవ్వాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతినిధుల బృందం డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ప్రతినిధుల బృందం శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఎంహెచ్‌ఓ డా. జె. నరసింహ నాయక్, ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా కోఆర్డినేటర్ డా. పి. రాధాకృష్ణలను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పెండింగ్ బిల్లులు రూ.3,000 కోట్లకు పైగా ఉండడాన్ని, నెలవారీ ఖర్చులు కూడా మినహాయించలేని పరిస్థితిని వివరించారు. ప్యాకేజీ రేట్లు పునర్విచారణ చేయకపోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రతరమైయ్యాయని పేర్కొన్నారు. అలా కాని పక్షంలో ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలందించడం నిలిపివేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ తరఫున డా.ఎస్.రామకృష్ణ, డా. వాడ్రేవు రవి, డా. ఆనంద్, డా.రామ్ మోహన్, డా.ఉమా పాల్గొన్నారు.

Next Story