అశ్లీల వీడియోలతో మహిళను బ్లాక్ మెయిల్.. చివరికి ఏమైందంటే?

by Jakkula.Mamatha |

తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు, మహిళ అశ్లీల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

అశ్లీల వీడియోలతో మహిళను  బ్లాక్ మెయిల్.. చివరికి ఏమైందంటే?
X

దిశ,రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు, మహిళ అశ్లీల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి మండలం పీరా రామచంద్ర పురానికి చెందిన మహిళను ఇద్దరు వ్యక్తులు వేధింపులకు గురిచేస్తున్నారు. మహిళ స్నానం చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన నల్లమిల్లి మణికంఠరెడ్డి, కర్రీ రామకృష్ణారెడ్డి రహస్యంగా వీడియోలు తీశారు.

ఆ తరువాత ఆ వీడియోలను మహిళకు చూపించి వేధింపులకు గురి చేశారు. మహిళ స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే తమ కోరిక తీర్చాలంటూ బ్లాక్ మెయిల్ చేశారు. ఎవరికైనా చెబితే అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామంటూ బాధితురాలి బెదిరించారు. ఏం చేయాలో తెలియక మహిళ తీవ్ర భయాందోళనకు గురై చివరకు ధైర్యం చేసి బుధవారం అనపర్తి పోలీసులను ఆశ్రయించింది.

పోలీసుల అదుపులో నిందితులు

బాత్ రూంలో స్నానం చేస్తున్న వివాహితను రహస్యంగా వీడియో తీసి లైంగిక వేధింపులకు పాల్పడడమేకాక, డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అనపర్తి ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు.వివరాల్లోకి వెళితే అనపర్తి మండలం పీరారామచంద్రపురానికి చెందిన నల్లమిల్లి మణికంఠరెడ్డి, కర్రి రామకృష్ణారెడ్డిలు ఓ వివాహిత స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశారు. అనంతరం తమ కోరిక తీర్చడమే కాకుండా, రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆ వివాహిత ఫిర్యాదుతో ఇరువురిపై కేసు నమోదు చేయడంతో పాటు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై శ్రీను నాయక్ చెప్పారు.

Next Story