- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోలర్ స్కేటింగ్‌లో గోల్డెన్ గర్ల్
by Vemula.Srinu Prasad |
విశాఖ రోలర్ స్కేటింగ్ జాతీయ స్థాయి పోటీల్లో కాకినాడ ఆశ్రమం పాఠశాల విద్యార్థిని ఆకుల కావ్యశ్రీ మూడు బంగారు పతకాలు సాధించింది.

X
దిశ, కాకినాడ / పిఠాపురం: విశాఖపట్నంలో జరుగుతున్న రోలర్ స్కేటింగ్ జాతీయ స్థాయి పోటీల్లో భాగంగా కాకినాడ ఆశ్రమం పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఆకుల కావ్యశ్రీ పలు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించింది. కాకినాడ కలెక్టరేట్‌లో ఆకుల కావ్యశ్రీ తన తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న ఈ రోలర్ స్కేటింగ్ జాతీయ స్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి మూడు బంగారు పథకాలు సాధించడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఈ సందర్భంగా కావ్యశ్రీని ప్రత్యేకంగా అభినందనందించారు. ఇదే పట్టుదల, స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కాకినాడకు గుర్తింపు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఐఎల్ఏ అధ్యక్షులు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






