అసలే ఇరుకు రోడ్డు.. భారీ వాహనాన్ని అదుపు చేయండి!

by Jakkula.Mamatha |

నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం ఓఎన్జీసీ ప్లాంట్ నుంచి భారీ వాహనాలు మెటీరియల్ వేసుకుని రోజు పగలు అడ్డు అదుపు లేకుండా వేళుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

అసలే ఇరుకు రోడ్డు.. భారీ వాహనాన్ని అదుపు చేయండి!
X

దిశ, అమలాపురం: నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం ఓఎన్జీసీ ప్లాంట్ నుంచి భారీ వాహనాలు మెటీరియల్ వేసుకుని రోజు పగలు అడ్డు అదుపు లేకుండా వేళుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇరుకు రోడ్ లో భారీ వాహనాలు వెళుతున్నాయని ఎస్ యానం, చల్లపల్లి, వాసాల తిప్ప. సరిపల్ల, గోపవరం, కూనవరం, కితన్ చెరువు ,సవరపాలెం, సమనస, విలసవెల్లి, రెడ్డి పెళ్లి, కామనగరువు ఎర్ర వంతెన దిగువ అన్ని గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇరుకు రోడ్‌లో ప్రయాణం చేస్తున్నారు.

ఓఎన్జీసీ కోట్లాది రూపాయలు దోచుకుని ప్రయాణికులను పట్టించుకోకుండా ఆర్టిఏ మరియు ఉప్పలగుప్తం పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు చూసి చూడనట్టు లారీలు అదుపు లేకుండా వెళుతున్నాయి. కావున ఈ కిందిగామస్తులు ఈ భారీ వాహనాన్ని అదుపు చేయాలని క్రింది గ్రామస్తులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. గతంలో చల్లపల్లి లో భారీ ప్రమాదం జరిగింది. ఇక మీదట ఏదైనా భారీ ప్రమాదం జరిగితే అధికారులే బాధ్యత వహించాలని కింద గ్రామస్తులు, ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Next Story