- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ నినాదాలతో బ్యాంకు ఎదుట బాధితుల ఆందోళన..!
కోనసీమ జిల్లా కొత్తపేటలో ఇటీవల సత్య సూర్య బ్యాంకర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది.

దిశ, కొత్తపేట : కోనసీమ జిల్లా కొత్తపేటలో ఇటీవల సత్య సూర్య బ్యాంకర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. బాధితుల బంగారం, నగదుతో బ్యాంకర్స్ సంస్థ లోని ఒక పార్ట్నర్ అయిన హేమంత్ పరారయ్యాడు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కొందరు ఫిర్యాదు కూడా చేశారు. అయితే హేమంత్ పరారు అయ్యి పది రోజులు అవుతున్నా అతని ఆచూకీ తెలియకపోవడంతో బాధితులు బుధవారం ఆందోళన నిర్వహించారు. సంస్థలోని మరో పార్ట్నర్ అయిన శ్రీకాకుళం సత్తిబాబును బాధితులు నిలదీశారు. తమ బంగారం, నగలు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు.
కూలి పనులు చేసుకుని బతుకుతున్నా తాము కూడబెట్టుకున్న కొద్దిపాటి బంగారాన్ని తాకట్టు పెడితే వాటి ఆచూకీ తెలియకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు సమాధానం చెప్పాలంటూ మరో పార్ట్నర్ అయిన సత్తిబాబును వేడుకున్నారు. దీనికి స్పందించిన సత్తిబాబు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పరారైన హేమంత్ నగదు బంగారం తీసుకువెళ్లడో.. లేక షాపులోనే ఉంచారా.. అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు అయిందని 21 రోజుల తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు. ఆ వివరాలను బట్టి బాధితులకు బంగారు నగలు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.






