ప్రసాదంలో సైనైడ్ కలిపి 10 హత్యలు.. నిందితుడిపై కోర్టు సంచలన తీర్పు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-24 12:07:09  IST  )

ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి ఈజీ మనీ కోసం ప్రసాదంలో సైనైడ్ కలిపి వ్యక్తులను ఇచ్చి చంపడం కొనసాగించారు...

ప్రసాదంలో సైనైడ్ కలిపి 10 హత్యలు.. నిందితుడిపై కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: అతను జల్సాలకు అలవాటు పడ్డాడు. మందు, బిర్యానీ తినేందుకు డబ్బులు కావాలి. పని చేయలేడు. ఈజీగా డబ్బు సంపాదించి జల్సాలు చేయలనుకున్నాడు. ఇందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. బంగారం రెట్టింపు అవుతుందని రైస్ ఫుల్లింగ్ పేరుతో తెలిసినవారి నుంచి డబ్బులు తీసుకోవాలని అనుకున్నారు. వారితో మంచిగా ఉన్నట్లు నటించడం, వారి నుంచి అప్పులు తీసుకోవడం.. ఆ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేయడం సాగించారు. అలా పది మందిని ఎంచుకున్నారు. వారిని సైలెంట్‌గా, ఎవరికీ అనుమానం రాకుండా చంపేశారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులు, బంగారాన్ని దోచుకున్నారు. అలా పదిమందిని చంపేశాడు. ఏలూరు సమీపంలోని మాదేపల్లి గ్రామానికి చెందిన పీఈటీ మాస్టర్ నాగరాజు అనుమానాస్పద మృతితో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వెల్లంకి సింహాద్రి దారుణాలివే..


ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి ఈజీ మనీ కోసం ప్రసాదంలో సైనైడ్ కలిపి వ్యక్తులను ఇచ్చి చంపడం కొనసాగించారు. పీఈటీ మాస్టర్ నాగరాజు అనుమానస్పద మృతి చెందడంతో ఏలూరు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కూపీ లాగితే సింహాద్రి దారుణాలు బయటపడ్డాయి. పీఈటీ మాస్టర్ నాగరాజుకు కూడా సైనైడ్ కలిపిన ప్రసాదం ఇచ్చారు. అది తిన్న నాగరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే నాగరాజు ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారాన్ని సింహాద్రి ఎత్తికెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు నాగరాజును వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే నాగరాజు అప్పటికే మృతి చెందారు. తమకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సింహాద్రి దారుణాలను గుర్తించి కేసును రుజువు చేశారు. దీంతో సింహాద్రికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

Next Story