పండ్లు కాసే సమయానికి ఏపీని కసాయికి అప్పగించొద్దు: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

పండ్లు కాసే సమయానికి ఏపీని కసాయికి అప్పగించొద్దని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు..

పండ్లు కాసే సమయానికి ఏపీని కసాయికి అప్పగించొద్దు:  కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు పటిష్టమైన పునాదులు వేస్తున్నారని, ప్రస్తుతం పండ్లు కాస్తున్నాయని, ఈ సమయంలో రాష్ర్టాన్ని కసాయికి అప్పగించొద్దని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం చాలా విజయాలు సాధించిందని, మరో 20 సంవత్సరాల పాటు ఇలానే కొనసాగించాలని తాను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్, రాష్ట్రానికి సాయంపై రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.

వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్



2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రానున్న 20 ఏళ్ల పాటు 7 శాతం వృద్ధి రేటు కొనసాగించేలా బడ్జెట్ ఉందని తెలిపారు. బడ్జెట్ లో ఏపీకి చాలా ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు రూ. 10.134 కోట్లు, ఏపీ రాజధాని అమరావతకి రూ. 1,120 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని తెలిపారు. కేంద్రం చేసిన ఆర్థిక సాయంతో విశాఖ స్టీల్‌ జనవరిలో రూ.52 కోట్లు లాభాలు సాధించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని విధాలుగా సాయం చేస్తోందని, సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తోందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Next Story