అన్నవరం దేవస్థానం ఈవోగా త్రినాధరావు

by Vemula.Srinu Prasad |

అన్నవరం దేవస్థానం ఈవోగా త్రినాధరావు నియామకమయ్యారు...

అన్నవరం దేవస్థానం ఈవోగా త్రినాధరావు
X

దిశ, అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈవోగా రాజమండ్రి ఆర్జేసీ వేండ్ర త్రినాధరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈవోగా పని చేసిన రెవెన్యూ శాఖకు చెందిన వీర్ల సుబ్బారావును దేవాదాయ శాఖ ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో త్రినాధరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరి జవహర్లాల్ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో త్రినాధరావు అన్నవరం దేవస్థానం కార్య నిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టి గురువారం వివిధ విభాగాలను పరిశీలించారు. గతంలో త్రినాధ రావు ఇక్కడ ఈవోగా పనిచేసిన అనుభవం ఉండడంతో పరిపాలన సులభతరం అవుతుందని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు భావిస్తున్నారు. గత ఏడాదికాలంగా అన్నవరం కొండపై ఎటువంటి అభివృద్ధి పనులు జరగకపోవడంతో భక్తులు యాత్రికులు పలు అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా వసతి గదులు డార్మెటరీ హాల్సు టాయిలెట్లు వంటి వాటిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Next Story