- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ప్రమాదవశాత్తు కాలువలో పడి చిన్నారి మృతి
తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో విషాదం చోటు చేసుకుంది....

దిశ, వెడ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) కొప్పవరం(Koppavaram)లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి నాలుగేళ్ల చిన్నారి(child) మృతి చెందారు. పాప ఆడుకుంటూ కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు(parents) ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక పరిస్థితులను పరిశీలించిన పోలీసులు.. చిన్నారి కాలువలో పడి ఉంటుందని అనుమానించారు. ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఫైర్, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు. రెండు లాకులు దాటి కాలువలో పాప కొట్టుకుపోయినట్లు అంచనా వేశారు. కొప్పవరానికి 12 కిలో మీటర్ల దూరంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఫైర్ సిబ్బంది సాయంతో బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో అటు స్థానికంగానూ విషాద ఛాయలు అలుమకున్నాయి.






