జియో ఆఫర్ పేరిట రూ.12 వేలకు టోకరా

by Jakkula.Mamatha |

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సింహాద్రిపురంలో సైబర్ మోసానికి రూ.12 వేలు రమేష్ అనే యువకుడు పోగొట్టుకున్నాడు

జియో ఆఫర్ పేరిట రూ.12 వేలకు టోకరా
X

దిశ, జగ్గంపేట: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సింహాద్రిపురంలో సైబర్ మోసానికి రూ.12 వేలు రమేష్ అనే యువకుడు పోగొట్టుకున్నాడు. ఇటీవల జియో ఆఫర్ తో మీకు మూడు కూపన్లు వస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించి మోసం చేసినట్లు బాధితుడు రమేష్ వాపోయాడు. జియో ఆఫర్ తో నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఫోన్ పే పిన్ నెంబర్ అడిగి 12 వేల రూపాయలు కొట్టేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా 1930 సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయమని పోలీసులు చెబుతున్నారని బాధితుడు రమేష్ తెలిపారు.

Next Story