గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-27 16:53:48  IST  )

జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతు
X

దిశ, అల్లవరం: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పి.గన్నవరం మండలం ఆచంట మండలం రావి లంక వద్ద వశిష్ఠ గోదావరిలో నాగుల్లంక గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ రోజు(మంగళవారం) ఐదుగురు యువకులు గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ముగ్గురు గోదావరి నీటిలో మునిగి పోయినట్లు చెబుతున్నారు. వారి బట్టలు సెల్ ఫోన్లు గోదావరి వద్ద గుర్తించారు. వారితో పాటు వెళ్లిన ఇరువురు తిరిగి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. మునిగిపోయిన వారిలో సానబోయిన సూర్యతేజ, నీతి పూడి పవన్ కుమార్, కేతా ప్రవీణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story