న‌దిలో నిలిపోయిన పంటు.. ప్రయాణికుల్లో అలజడి

by Vemula.Srinu Prasad |

సఖినేటిపల్లి, నరసాపురం మధ్య పంటు దాటింపుల్లో తీవ్ర అల‌జ‌డి రేగింది..

న‌దిలో నిలిపోయిన పంటు.. ప్రయాణికుల్లో అలజడి
X

దిశ‌, అమ‌లాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మధ్య ఉన్న పంటు దాటింపుల్లో ఆదివారం తీవ్ర అల‌జ‌డి రేగింది. వ‌శిష్ట న‌దిలో సుమారు అర‌గంట సేపు సాంకేతిక లోపంతో పంటు నిలిచిపోవ‌డంతో పంటులో ప్రయాణిస్తున్నవారంతా తీవ్ర క‌ల‌వ‌రానికి గుర‌య్యారు. ఆదివారం ఉద‌యం న‌ర్సాపురం రేవు నుంచి స‌ఖినేటిప‌ల్లి రేవుకు ప్ర‌యాణికులు, వాహ‌నాల‌తో బ‌య‌లు దేరిన పంటు సాంకేతిక సమస్యతో గోదావరి నది మధ్యలోనే సుమారు అరగంటసేపు ఆగిపోయింది. ఇంజ‌ను మొరాయించ‌డంతో ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని చెబుతున్నారు.

ఈ రేవు గూండా ప్ర‌తిరోజూ వంద‌ల సంఖ్య‌లో రాక‌పోక‌లు సాగిస్తుంటారు. సఖినేటిపల్లి రేవుకు వస్తున్న పంటు చాలాసేపు న‌ది మ‌ధ్య‌లో నిలిచిపోవ‌డంతో ఇరువైపులా రేవుల్లో ఉన్న‌వారికి ఏమ‌య్యిందో తెలియ‌ని ప‌రిస్థితి క‌నిపించింది. అయితే పంటులో ఉన్న సిబ్బంది నిర్వాహ‌కుల‌కు ఫోన్ ద్వారా స‌మాచారం అందివ్వ‌డంతో మ‌రో పంటును పంపి తాళ్ల‌తో క‌ట్టి ఒడ్డుకు లాక్కొచ్చారు. దీంతో పంటులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ ఆందోళన గురయ్యారు. ఈ ఘటన సమయంలో పంటులో సుమారు 80 మంది వరకు ప్రయాణికులు ఉండ‌గా క్షేమంగా ఒడ్డుకు చేరుకోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. పంటు దాటింపుల్లో కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా పంటు నిర్వ‌హ‌ణ చేస్తున్నార‌ని, సుర‌క్షిత సామాగ్రి అయిన లైఫ్ జాకెట్లు కూడా ఉంచ‌డం లేద‌ని ప‌లువురు మండిప‌డ్డారు.

Next Story