- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీగ దొరికింది.. డొంక కదులుతోంది..!
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజల్లో తీవ్ర అలజడి రేపుతోండగా గత కొంత కాలంగా బైక్‌లు మాయం అవుతున్న కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి

దిశ, అల్లవరం: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజల్లో తీవ్ర అలజడి రేపుతోండగా గత కొంత కాలంగా బైక్‌లు మాయం అవుతున్న కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. జిల్లాలో వరుస దొంగతనాల కలకలంపై జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా దర్యాప్తు చేపట్టారు. అయితే బైక్ దొంగతనాలపై ఇప్పటికే అమలాపురం రూరల్ పోలీసులకు దొరికిన తీగను లాగి మరింత లోతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో గంజాయి మూలాల డొంక కదులుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుల వ్యవహారంలో అనేక కోణాల్లో విచారణ వేగవంతం చేసిన అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్‌కుమార్ దూకుడుతో ఇప్పటికే అనేక బైక్ దొంగతనాలకు సంబందించి కీలక అంశాలు గుర్తించినట్లు సమాచారం. దీని ద్వారా కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జిల్లాలోని ముఖ్యంగా యువతను నేర ప్రవృత్తి వైపు లాగుతోన్న గంజాయి సప్లై ముఠాను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు బైక్ దొంగతనాలు, ఇటు గంజాయి బ్యాచ్‌ను గుర్తించిన పోలీసులు మొత్తం మీద గంజాయి మూలాల డొంక కదిలే అసలైన తీగను పట్టుకుని విచారిస్తుండగా మరికొన్ని రోజుల్లో గంజాయి మాఫియా గుట్టు రట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పేట్రేగిపోతున్న గంజాయి బ్యాచ్..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంను గంజాయి బ్యాచ్ టార్గెట్ చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అమలాపురం రూరల్ పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అమలాపురం పట్టణ శివారు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఈ విక్రయాలు జరుపుతుండగా ముఖ్యంగా యూత్‌ను వీరు టార్గెట్ చేసుకుని ఆదిశగా విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. ఈదరపల్లి నుంచి నల్లవంతెన వరకు బైపాస్ రోడ్డు, కామనగరువు పంచాయతీ పరిధిలోని నిర్జన ప్రాంతాలు, ఏరియా ఆసుపత్రి వెనుక శిధిల భవనం, ఇందుపల్లి రోడ్డు మార్గంలోని ఖాళీ లేఅవుట్లు, బోడసకుర్రు నుంచి భట్నవిల్లి వరకు హైవే మార్గం ఇలా అనేక చోట్ల గంజాయి బ్యాచ్ తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తుండగా అసలు ఇటీవల పెరుగుతోన్న నేరాలకు మూలాలు ఈ గంజాయి బ్యాచ్ అనే సమాచారాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇక్కడ కదిపితో అక్కడ కదిలింది..
వరుస బైక్‌ల దొంగతనాలపై ప్రజల నుంచి విపరీతంగా ఫిర్యాదులు అందుతుండడంతో దీనిపై పోలీసులు సీరియస్‌గా తీసుకుని మొత్తం మీద బైక్‌లు కోట్టేసే ముఠాను గుర్తించినట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకుని ఈ గంజాయి విక్రయ మూలాలు కూడా గుర్తించి మళ్లీ ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అమలాపురం కేంద్రంగా ముఠా కార్యకలాపాల డొంక కదిలినట్లు సమాచారం.






