- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేట్లపాలెం ఘటన మాటలకందని విషాదం
సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుళ్ళు ఘటన మాటలకందని విషాదమని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు...

దిశ, కాకినాడ: సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుళ్ళు ఘటన మాటలకందని విషాదమని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హుటాహుటిన వేట్లపాలెంలో ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రెవెన్యూ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి సహాయక చర్యలు వేగవంతం చేశారు.
అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఘటనా స్థలం నుండి నేరుగా కాకినాడ జిజిహెచ్ కు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు కోరారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదంలో పెద్ద ఎత్తున కార్మికులు మృతి చెందడం బాధాకరమని, బాధిత కుటుంబ సభ్యులను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. ఆయన వెంట యు కొత్తపళ్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు రావు అక్షయ్ పాల్గొన్నారు.






