కిడ్నాపైన బాలుడు సురక్షితం

by Jakkula.Mamatha |

కాకినాడ జిల్లా తునిలో కిడ్నాప్ అయిన బాలుడు పరమేష్ కథ సుఖాంతమైంది.

కిడ్నాపైన బాలుడు సురక్షితం
X

దిశ,తుని: కాకినాడ జిల్లా తునిలో కిడ్నాప్ అయిన బాలుడు పరమేష్ కథ సుఖాంతమైంది. కిడ్నాపైన బాలుడు సురక్షితంగా ఉండటం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక భాష్యం స్కూల్ లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న పరమేష్ ను సోమవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్ నుంచి తీసుకెళ్లారు. బాలుడి కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు.

బాలుడు తండ్రికి కిడ్నాపర్ ఫోన్ చేసి మీ అబ్బాయిని సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు పంపిస్తున్నానని చెప్పడంతో బాలుడు బంధువులు, పోలీసులు సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. తల్లిదండ్రుల వద్దకు కిడ్నాప్ కు గురైన బాలుడు అటోలో రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాపర్ బాలుడిని తుని మండలం డి.పోలవరం వద్ద ఆటో ఎక్కించి ఆటో డ్రైవర్ తో బాలుడు బంధువులు వస్తారని, వారికి బాలుడిని అప్పగించాలని చెప్పినట్లు బాలుడిని తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ పోలీసులకు వివరించాడు.

Next Story