అగ్ని ప్రమాదం.. కళ్ల ముందే ఇల్లు దగ్ధం

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-21 14:51:28  IST  )

అల్లవరం మండలం దేవగుప్తం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో బుంగ చిట్టిబాబుకు చెందిన తాటాకిల్లు మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది.

అగ్ని ప్రమాదం.. కళ్ల ముందే ఇల్లు దగ్ధం
X

దిశ, అల్లవరం: అల్లవరం మండలం దేవగుప్తం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో బుంగ చిట్టిబాబుకు చెందిన తాటాకిల్లు మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. స్నానం చేసేందుకు కట్టెల పొయ్యి పై నీళ్లు కాస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో మంటలను ఆర్పడానికి అవకాశం లేకుండా పోయిందని స్థానికులు తెలిపారు. కట్టుబట్టలు తప్ప ఏమి మిగల్లేదని, సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం ఉంటుందని బాధితులు తెలిపారు. కళ్ల ముందే ఇళ్లు కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Next Story