- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి సుభాష్ భేష్.. నిధుల మంజూరులో ఫస్ట్
కార్మిక శాఖ మంత్రి వాశంసెట్టి సుభాష్‌ను అధిష్టానం మెచ్చుకుంది..

దిశ, రామచంద్రపురం: కార్మిక శాఖా మంత్రి వాశంసెట్టి సుభాష్‌ను అధిష్టానం మెచ్చుకుంది. రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న సేవలకు ప్రత్యేక ప్రశంసలు అందించింది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల సమావేశంలో సుభాష్‌ను అభినందించారు. నియోజకవర్గంలో మంత్రిపై చేసిన సర్వేలోనూ ప్రజల నుంచి సానుకూల అభిప్రాయం వచ్చింది. దీంతో కూటమి నాయకుల నుంచి ఆనందాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రజా దర్బారు నిర్వహిస్తున్న తీరు సీఎస్‌ఆర్ నిధుల నుంచి నియోజకవర్గంలో చేయనున్న అభివృద్ధికి ప్రత్యేక మార్కులు దక్కాయి. మంత్రుల్లో సుభాష్‌కు రెండో స్థానం దక్కినట్లు తెలుస్తోంది.
రామచంద్రపురం టిడిపి కార్యాలయంలో ప్రతీ సోమ, మంగళ వారాల్లో ప్రజా దర్బారు నిర్వహిస్తున్న తీరు ప్రశంసనీయం అని చాలా మంది అంటున్నారు. ఇక్కడి దర్బారునకు నియోజకవర్గం నలు మూలల నుంచి అధిక సంఖ్యలో సమాన్య ప్రజానికం వస్తున్నారు. వారి అర్జీలను ఆలకించి , వారి సమస్యలు అక్కడిక్కడే పరిష్కరించి పంపిస్తున్నారు. వారికి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు.
ప్రజా సేవకుడు మాకు దొరకడం అదృష్టం
‘‘నియోజకవర్గానికి ప్రజా సేవకుడు దొరకడం చాలా అదృష్టం. పలు పనులు నిమిత్తం వెళ్లిన వారికి కాదనకుండా పనులు పూర్తి చేస్తున్నారు. చాలా మంది శాసన సభ్యులను చూశాం. కానీ మంత్రి సుభాష్ పని తీరు ఆకట్టుకుంది. ఆర్యవటం నుంచి మధ్యలో చాలా గ్రామాలు కలుపుతూ జగన్నాధగిరి దాకా రహదారికి నిధులు మంజూరు చేయడం చాలా ఆనందగా ఉంది.’’ అని విశ్రాంతి ఉద్యోగి ధనరాజు తెలిపారు.






