తుప్పలు పెరిగి శిధిలస్థితికి రైతుబజారు

by Vemula.Srinu Prasad |

రైతుబజారు నిరుపయోగంగా మారింది...

తుప్పలు పెరిగి శిధిలస్థితికి  రైతుబజారు
X

దిశ, సీతానగరం: రైతులు పండించిన ఉత్పత్తులను గ్రామాల్లోనే తక్కువ ధరకు వినియోగదారులకు విక్రయించాలనే లక్ష్యంతో రైతు బజారు కేంద్రం ఏర్పాటు చేశారు. రఘుదేవపురం గ్రామపంచాయతీ పరిధిలో అప్పటి తెలుగుదేశం పార్టీ పూర్తిచేసింది. అనంతరం వైసీపీ అధికారంలోకి రాగానే ఆ కేంద్రాన్ని అట్టహాసంగా ప్రారంభించింది నాటి నుంచి నేటి వరకు దానిని వదిలేయడంతో ప్రస్తుతం చుట్టూ తుప్పలు పెరిగి శిధిలస్థితికి చేరింది. రూ. లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేసినా వినియోగించకపోవడంతో ఇలా తయారైంది.

అయితే మండలంలో ఏకైక రైతు బజార్ కేంద్రమైనా అందుబాటులోకి వస్తే తక్కువ ధరకు కూరగాయలు లభిస్తాయని పడిన వినియోగదారుల ఆనందం ఆవిరైంది. దీనిని అదునుగా ఎక్కడ రైతు బజార్లు లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారస్తులు చెప్పిన రేటుకు కూరగాయలు కొనవలసి వస్తుందని వినియోగదారులు వాపోతున్నార. ప్రైవేటు కూరగాయల వ్యాపారస్తులు రెట్టింపు రేట్లుతో వినియోగదారులు జేబీలకు చిల్లులు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతు బజార్ కేంద్రాని ప్రజలకు అందుబాటులో తీసుకుని రావాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికీ రఘుదేవపురంలో రైతు బజారు లేకుండా రోడ్డు పక్కనే మాంసం, చేపలు, కూరగా యలు విక్రయాలు చేస్తున్నారు

Next Story