- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ సీఎం పవన్ ఉదారత... ఇద్దరు చిన్నారులకు ప్రతినెల రూ.5 వేలు
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇద్దరు చిన్నారులకు తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అండగా నిలుస్తోంది..

దిశ, కాకినాడ: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉదారతతో ఇద్దరు చిన్నారులకు ఆసరా దొరికింది. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ వద్దకు చేరిన ఇద్దరు చిన్నారులకు అండగా నిలబడేందుకు జిల్లా అధికార యంత్రాంగం మానవత్వంతో ముందడుగు వేసింది. పిల్లలకు గూడు కల్పించేందుకు ఇంటి స్థలాన్ని ఇచ్చేందుకు నడుం బిగించింది. పిఠాపురం నియోజకవర్గం మాదాపూర్ గ్రామంలో ఇటీవల తల్లిదండ్రులు ఇద్దరును కోల్పోయిన చిన్నారులు గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌ను కలిశారు.
చిన్నారులకు ప్రతినెల రూ.5 వేలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇద్దరు చిన్నారులకు జిల్లా అధికార యంత్రాంగం అండగా నిలుస్తుందన్నారు. చిన్నారులు ఇద్దరు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతు బాధ్యతగా ఇద్దరు చిన్నారులకు ప్రతినెల రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ప్రకటన చేయడం జరిగింది అన్నారు. పిల్లలకు శాశ్వతం నివాసం కల్పించేందుకు జిల్లా అధికార యంత్రం నుంచి వెంటనే ఇంటి పట్టాను మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా త్వరితన ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేలా సమంత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. పిల్లలు చదువుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందర్భంగా తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం నాటికి ఇంటి పట్టా అందించేందుకు చర్యలు ఎమ్మార్వో, ఎంపిడివో చేపట్టారు.






