వామ్మో చెట్టంత పుట్ట.. ఏకంగా 10 అడుగుల ఎత్తు..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-07 03:44:57  IST  )

తూర్పుగోదావరి జిల్లాలో 10 అడుగుల పుట్ట అందరినీ ఆశ్చర్యపరుస్తోంది...

వామ్మో చెట్టంత పుట్ట.. ఏకంగా 10 అడుగుల ఎత్తు..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ రోజు కనిపించనవి రేపు అకస్మాత్తుగా కనిపిస్తుంటాయి. దీంతో ఆశ్చర్యపోతుంటాం. కానీ నోరు తెరుచుకుని అలాగే చూస్తూ ఉండుపోయే వింతలు మాత్రం చాలా రేర్‌ అని చెప్పాలి. ఇలాంటి ఓ ఆశ్చర్యకరమైన దృశ్యం తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీలో ఓ పుట్ట రోజు రోజుకు చెట్టు మాదిరి పెరుగుతోంది. సాధారణంగా 6 నుంచి 7 అడుగుల పుట్టలు కనిపించడం సహజం. కానీ ఇక్కడ మాత్రం 10 అడుగుల పెట్ట చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. బూరుగువీధి ప్రభుత్వ పాఠశాల ఎదుట ఈ పుట్ట దర్శనిస్తోంది. తొలుత చిన్నగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం పక్కనున్న చెట్టుతో సమానంగా పెరుగుతోంది. దీంతో జనం ఆశ్యర్యపోతున్నారు. ఇది దేవుడి మహత్యమేనంటూ పూజలు చేస్తున్నారు.

ఈ విషయం ఆర్కియాలజీకల్ సర్వే అధికారులను తెలిసింది. దీంతో పుట్ట పెరుగుదలకు కారణాలేంటనే అంశాలపై దృష్టి సారించారు. త్వరలోనే పుట్టను పరిశీలించే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంటున్నారు. కానీ ఇంత పెట్ట పుట్ట కనిపించడంతో జనం తండోపతండాలు తరలివచ్చి చూస్తున్నారు. పుట్టలో పాలు, గుడ్లు వేస్తున్నారు. పుట్ట చుట్టూ తిరిగి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు పుట్టవద్దకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నా జనం వినడంలేదు. పుట్టలో నాగదేవత ఉందని, అందుకే పూజలు చేస్తున్నామని అంటున్నారు.

Next Story