Inter Supplementary Exams:విద్యార్థులకు స్లిప్పులు అందిస్తూ ఫ్లయింగ్ స్క్వాడ్‌కు దొరకిన టీచర్స్.. చివరికి!?

by Jakkula.Mamatha |

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Inter Supplementary Exams:విద్యార్థులకు స్లిప్పులు అందిస్తూ ఫ్లయింగ్ స్క్వాడ్‌కు దొరకిన టీచర్స్.. చివరికి!?
X

దిశ, అన్నవరం : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షల నేపథ్యంలో కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు స్లిప్పులు అందించడంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఇద్దరు అధ్యాపకులకు జిల్లా పరీక్షల కమిటీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇవాళ(శుక్రవారం) ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న సమయంలో అన్నవరంలోని సత్య దేవ జూనియర్ కళాశాలలో ఇన్విజిలేటర్లు ఫ్లయింగ్ స్క్వాడ్ విద్యార్థుల పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు.

ఆ సమయంలో మ్యాథమెటిక్స్ అధ్యాపకులు మోకిన కొండబాబు, తెలుగు అధ్యాపకురాలు జి కృష్ణవేణి వారి విధుల పట్ల అలసత్వం వహించడంతో పాటు విద్యార్థులకు స్లిప్పులు అందించడం లో ఫ్లయింగ్ స్క్వాడ్ కు నేరుగా దొరికిపోయారు. దీంతో ఇన్విజిలేటర్లు వెంటనే జిల్లా పరీక్షల కమిటీకి విషయాన్ని తెలుపగా ఇద్దరు అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈవో కు జిల్లా పరీక్షా కమిటీ సూచిస్తూ లేఖను పంపించింది. అదేవిధంగా విద్యాశాఖ కార్యాలయానికి 24 గంటల్లో నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

Next Story