చెస్ పోటీల్లో విశేష ప్రతిభ.. విద్యార్థికి అభినందనలు

by Vemula.Srinu Prasad |

చెస్ పోటీల్లో విశేష ప్రతిభ చూపిన విద్యార్థికి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు..

చెస్ పోటీల్లో విశేష ప్రతిభ.. విద్యార్థికి అభినందనలు
X

దిశ, అల్లవరం: భీమవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ర్యాపిడ్ చెస్ పోటీల్లో అల్లవరం మండలం ఎలువల్లంక గ్రామం మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థి గంటా రాజ్ తరుణ్ అండర్- 09 కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించాడు. అమలాపురం విక్టరీ అకాడమిలో చెస్ శిక్షణ పొందుతున్నాడు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లావణ్య, చెస్ అసోసియేషన్ ప్రతినిధులు విద్యార్థి రాజ్ తరుణ్‌ను అభినందించారు.

Next Story