- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > ఆంధ్రప్రదేశ్ > తూర్పుగోదావరి > Chandrababuకు కార్యకర్త నుంచి ఊహించని ప్రశ్న.. తల ఊపుతూ నవ్వుకున్న అధినేత
Chandrababuకు కార్యకర్త నుంచి ఊహించని ప్రశ్న.. తల ఊపుతూ నవ్వుకున్న అధినేత

X
దిశ, డైనమిక్ బ్యూరో :తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆ పార్టీ నేత అడిగిన ప్రశ్న ముప్పు తిప్పలు పెట్టింది. చంద్రబాబు నాయుడు 'ఇదేం ఖర్మ' మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అయితే ఓ కార్యకర్త నుంచి చంద్రబాబుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. హైదరాబాద్‌లో ఉండొద్దని మన రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇల్లు నిర్మించుకుని కుటుంబ సభ్యులతో జీవించాలని కోరారు. ఇది తనతోపాటు రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల విన్నపమని అన్నారు. విన్నపం కాదని డిమాండ్ అని చెప్పుకొచ్చారు. ఆ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు తల ఊపుతూ నవ్వి ఊరుకున్నారు.
Next Story