వందే భారత్ రైలు హాల్టు ఇవ్వండి: పాలకొల్లు వాసుల విజ్ఞప్తి

by Vemula.Srinu Prasad |

వందే భారత్ రైలు హాల్టు ఇవ్వాలని పాలకొల్లు వాసులు విజ్ఞప్తి చేశారు...

వందే భారత్ రైలు హాల్టు ఇవ్వండి: పాలకొల్లు వాసుల విజ్ఞప్తి
X

దిశ, పాలకొల్లు: నర్సాపురం- చెన్నై మధ్య ఈ నెల 15 నుంచి కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా ప్రారంభించే వందే భారత్ రైలును పాలకొల్లులో ఆపాలనితూర్పుగోదావరి జిల్లా ప్రజలు కోరుతున్నారు. 20678 నంబర్‌లో నర్సాపూరం నుంచి మధ్యాహ్నం 2: 50 కి బయలుదేరి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణించి రాత్రి 11: 45 కు చెన్నై చేరుకుంటుందని, అలాగే చెన్నై నుంచి 20 677 నెంబర్‌తో ఉదయం 5: 35కి బయలుదేరి మధ్యాహ్నం 2.10కి చేరుకుంటుందని మధ్యలో నర్సాపురం, భీమవరం టౌన్, గుడివాడ స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నరసాపురం కంటే పాలకొల్లులోనే ఎక్కువ ప్రయాణికులు ఎక్కుతారని, ఇది వ్యాపార కేంద్రం కావడమే కారణమని అంటున్నారు. అలాగే చించినాడ బ్రిడ్జి ద్వారా తూర్పుగోదావరి నుంచి ప్రయాణికులు అత్యధికంగా నరసాపురం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు పాలకొల్లుకే వస్తారని తెలిపారు. ఇందుచేత పాలకొల్లులో తప్పనిసరిగా ఈ వందే భారత్ రైలు హాల్టు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story