‘దిశ’ కథనానికి స్పందన.. తీరంలో ఇసుక, మట్టి తవ్వకాల పై RDO ఆగ్రహం

by Jakkula.Mamatha |

అల్లవరం మండలం కొమరగిరిపట్నం తీరప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాల తో పాటు విచ్చలవిడిగా మట్టి అక్రమ తరలింపు పై "చెలరేగుతున్న మట్టి మాఫియా" అనే శీర్షికన వచ్చిన దిశ కథనానికి అమలాపురం ఆర్డీవో కె.మాధవి స్పందించారు.

‘దిశ’ కథనానికి స్పందన.. తీరంలో ఇసుక, మట్టి తవ్వకాల పై RDO ఆగ్రహం
X

దిశ, అల్లవరం: అల్లవరం మండలం కొమరగిరిపట్నం తీరప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాల తో పాటు విచ్చలవిడిగా మట్టి అక్రమ తరలింపు పై "చెలరేగుతున్న మట్టి మాఫియా" అనే శీర్షికన వచ్చిన దిశ కథనానికి అమలాపురం ఆర్డీవో కె.మాధవి స్పందించారు. తహసీల్దార్‌ వీఎల్‌ నరసింహారావుతో మాట్లాడి వెంటనే చర్యలకు ఆదేశించారు. తీరప్రాంతంలో అలైన్డ్‌ భూముల్లో అక్రమ ఆక్వా చెరువులతోపాటు అదే సమయంలో ఇసుకను తవ్వి తరలింపులపై చర్యలు తీసుకోవాలని, ఇసుకను విక్రయిస్తున్న భూ యజమానులకు, ఇసుకను తరలిస్తున్న ట్రాక్టరు యజమానులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తరలింపులపైనా దృష్టి పెట్టి మితిమీరిన వేగంతో రోడ్లుపై తిరుగుతున్న ట్రాక్టర్లును సీజ్‌ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, తరలింపులుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ నరసింహారావు తెలిపారు. ఇక ఈ మాఫియాను నడిపిస్తోంది కొందరు వైసీపీ నాయకులేనని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. దిశ కథనంతో స్థానిక కూటమి నాయకత్వం లో తీవ్ర చర్చకు దారితీసింది.

Next Story