- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ చైతన్య స్కూల్‌లో దారుణం.. ర్యాగింగ్ పేరుతో ఐరన్ బాక్స్‌తో శరీరమంతా వాతలు
రాజమండ్రి శ్రీ చైతన్య స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. టెన్త్ క్లాస్ స్టూడెంట్ విన్సెంట్ ప్రసాద్‌ను తోటి విద్యార్థులు దారుణంగా టార్చర్ చేశారు. ర్యాగింగ్ పేరుతో ఐరన్ బాక్స్‌తో శరీరమంతా కాల్చి, వాతలు పెట్టారు. ఘోరంగా బాది.. కడుపు, చేతులు, తొడపై కాల్చారు

దిశ, వెబ్ డెస్క్ : రాజమండ్రి శ్రీ చైతన్య స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. టెన్త్ క్లాస్ స్టూడెంట్ విన్సెంట్ ప్రసాద్‌ను తోటి విద్యార్థులు దారుణంగా టార్చర్ చేశారు. ర్యాగింగ్ పేరుతో ఐరన్ బాక్స్‌తో శరీరమంతా కాల్చి, వాతలు పెట్టారు. ఘోరంగా బాది.. కడుపు, చేతులు, తొడపై కాల్చారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారన్న విషయాన్ని ప్రిన్సిపల్‌కు చెప్పినందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ నెల 16న మొరంపూడి హాస్టల్లో ఈ ఘటన జరగ్గా... ఇన్నాళ్లు యాజమాన్యం దాచిపెట్టింది. విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. కనీసం బాధిత విద్యార్థి గాయాలను కూడా పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
కాగా విన్సెంట్ ప్రసాద్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం గ్రామానికి చెందిన వాడు కాగా.. ఈ ఘటన గురించి బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారని సమాచారం. ప్రస్తుతం బాధితుడు రాజోలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. జిల్లా విద్యాశాఖ ఈ ఘటనను ధృవీకరించింది. విచారణ జరుపుతోంది. కాగా బాధితుడి తల్లి గుర్రం లక్ష్మీ కుమారి.. తన కొడుకుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన విద్యార్థులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






