Breaking: కల్తీ పాల ఘటనలో మరో మరణం నమోదు

by Vemula.Srinu Prasad |

రాజమండ్రి కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ అనే వ్యక్తి తాజాగా మరణించారు.....

Breaking: కల్తీ పాల ఘటనలో మరో మరణం నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి(Rajahmundry) సమీపంలోని కాలనీల్లో కల్తీ పాలు(Adulterated Milk) తాగి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ అనే వ్యక్తి తాజాగా మరణించారు. దీంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఏడుగురికి చేరింది. మరికొంతమందికి సైతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అటు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి మరీ వైద్యం అందిస్తున్నారు. కొంతమందికి డయాలసిస్ చేస్తున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ మరో మరణం నమోదు కావడంపై బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. మెరుగైన చికిత్స అందించి తమ వారిని సురక్షితంగా, ఆరోగ్యవంతులుగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

Next Story