- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సువర్ణ ఇండియా కేసులో నిందితులకు జైలు శిక్ష
అమలాపురం కేంద్రంగా సువర్ణ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడిన నిందితులకు శిక్ష ఖరారు అయింది..

దిశ, అమలాపురం: అమలాపురం కేంద్రంగా సువర్ణ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడిన నిందితులకు శిక్ష ఖరారు అయింది.. ఖాతాదారుల నుంచి ఫిక్సిడ్ డిపాజిట్‌లు, రికరింగ్ డిపాజిట్(ఆర్డీ)ల రూపంలో సుమారు రూ.14 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఈ ఉదంతంలో నిందితులకు రాజమహేంద్రవరం కోర్టు ఏడేళ్లు జైలు, జరిమానా విధించింది. రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన ఆసంస్థ ఎండీ బుసిం వేణుకు 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయలు జరినామా, డైరెక్టర్లుగా ఉన్న ఆయన భార్య భూసిం రాజ్యలక్ష్మికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా, ఆయన కుమార్తె భూసిం గౌతమికి 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరినామా విధిస్తూ సోమవారం రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సువర్ణ ఇండియా బాధితుల ఫిర్యాదు మేరకు 2015లో అప్పటి అమలాపురం పట్టణ సీఐ వై.ఆర్. కే శ్రీనివాస్ కేసును నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుల ఆస్తులను కూడా ప్రభుత్వానికి అటాచ్ చేసినట్లు తెలుస్తోంది.






