- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Mahanadu: రంగులు బాగా వేస్తారు... సీఎం జగన్‌పై లోకేశ్ సెటైర్స్
దిశ, వెబ్ డెస్క్: సైకో జగన్‌కు పాలన చేతకాదు గాని.. రంగులు మాత్రం బాగా వేస్తారని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు కడిస్తే.. వాటికి రంగులు వేసి తన ఘనతగా చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ పక్కా ఇళ్ల పథకం టీడీపీది.. పక్కా గుడిసెల పథకం వైసీపీది అని అన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సెంటు స్థలం వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్పారు. ఇచ్చిన సెంటు స్థలంలో ఇళ్లు కట్టకపోతే వైసీపీ సైకోలు తీసేకుంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తాను యువగళం చేపట్టానని తెలిపారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులో చంద్రన్న తీసుకొన్న పరిశ్రమలు చూశాననని.. అటు పెద్దిరెడ్డి చేసిన 10 వేల కోట్ల అవినీతిని చూశానని నారా లోకేశ్ తెలిపారు. మంత్రాలయం జిల్లా నుంచి చాలా మంది ప్రజలు వలసపోతున్నారని తెలిపారు. కర్నూలు జిల్లాలో మహిళలు మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నారా లోకేశ్ తెలిపారు.
Also Read..
Mahanadu2023: పెద్దిరెడ్డి నుంచి పెద్దారెడ్డి వరకూ నారా లోకేశ్ మాస్ వార్నింగ్
TDP Mahanadu: పదుల సంఖ్యలో సొమ్మసిల్లి పడిపోతున్న టీడీపీ కార్యకర్తలు