నిలిచిపోయిన రహదారి పనులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

by Jakkula Mamatha |
నిలిచిపోయిన రహదారి పనులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
X

దిశ, కాజులూరు: కాజులూరు మండలంలో మొన్నటి దాకా ముమ్మరంగా సాగిన కుయ్యేరు - గొల్లపాలెం రహదారి నిర్మాణం పనులు ఒక్కసారి నిలిచిపోవడం ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రహదారి నిర్మాణం పనులు ఆలస్యంగా ప్రారంభం అయినా మొన్నటి దాకా పనులు వేగంగా సాగాయి. అయితే ఇటీవల కాలంలో రహదారికి వాటరింగ్ పట్ట పగలు చేస్తున్నారని ప్రజలు గగ్గోలు పెట్టారు. దీని వల్ల ట్రాఫిక్ నిలిచిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక కాజులూరులో రోడ్డు వెడల్పు తగ్గుతుందని ప్రజలు ధ్వజం ఎత్తారు. ఇత్యాది పరిణామాల నడుమ రహదారి పనులు నిలిచిపోయాయి. దీని వల్ల రహదారి నిర్మాణం పూర్తిగా ఆలస్యం అవుతుంది అని అంటున్నారు. విషయమై ఆర్ అండ్ బి అధికారులను వివరణ కోరగా మేటిరియల్ సమస్య వచ్చిందని అంటున్నారు.

Next Story