భారీగా సత్యదేవుడి హుండీ ఆదాయం

by Vemula.Srinu Prasad |

అన్నవరం సత్యదేవుడి హుండీల ఆదాయం రూ.కోటి 83 లక్షలు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు..

భారీగా సత్యదేవుడి హుండీ ఆదాయం
X

అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడికి హుండీల ద్వారా రూ.కోటి 83 లక్షలు ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. కొండపై స్వామివారి శాశ్వత కళ్యాణ మండపంలో దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాధరావు సమక్షంలో అధికారులు సిబ్బంది పురోహితులు కలిసి హుండీ లలోని సొమ్మును లెక్కించారు. కొండ దిగువన వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన హుండీలను తెరిచారు. సుమారు 35 రోజులకు గాను ఈ ఆదాయం లభించినట్లు చెప్పారు. ఇందులో 11 గ్రాముల బంగారం, 625 గ్రాములు వెండి, యూఎస్ఏ డాలర్లు 157, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహరన్ 1, యూఏఈ 30, సింగపూర్ 14, సౌదీ అరేబియా 111, ఆస్ట్రేలియా 60, ఖతర్ 10, కెనడా 25, మలేషియా 11, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్ 1100, బ్యాంక్ ఆఫ్ కొరియా 2000, స్కాట్లాండ్ 10, క్వాంజా 500 లభించినట్లు అధికారులు తెలిపారు.

Next Story