పాదగయ క్షేత్రాన్ని సందర్శించిన 300 మంది ఉత్తరాది స్వామీజీలు

by Vemula.Srinu Prasad |

పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని ఉత్తరాది స్వామీజీలు పెద్ద ఎత్తున సందర్శించారు....

పాదగయ క్షేత్రాన్ని సందర్శించిన 300 మంది ఉత్తరాది స్వామీజీలు
X

దిశ, పిఠాపురం: కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని ఉత్తరాది స్వామీజీలు పెద్ద ఎత్తున సందర్శించారు. గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్న క్షేత్రాల సందర్శనలో భాగంగా పిఠాపురాన్ని సందర్శించినట్లు స్వామీజీలు తెలిపారు. గోదావరి తీర ప్రాంతాల ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా 300 మంది స్వామీజీలు పిఠాపురం చేరుకున్నారు. పాదగయ పుష్కరిణికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్కుటేశ్వర స్వామి సన్నిధిలో శివనామస్మరణలతో స్వామీజీలు సందడి చేశారు. నాసిక్ నుంచి గోదావరి తీరం వరకు ఆధ్యాత్మిక యాత్రలో చేపట్టిన స్వామీజీలు తిరుగు ప్రయాణం మరలా నాసిక్ వద్ద గోదావరి జన్మస్థానం త్రయంబకేశ్వరం వద్ద ముగుస్తుందన్నారు.

రెండు గంటల పాటు పూజలు

స్వామీజీలు భారీగా చేరుకోవడంతో పాదగయ క్షేత్రం కిక్కిరిసింది. రెండు గంటల పాటు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న స్వామీజీలు, పిఠాపురం క్షేత్ర విశేషాలను ఆలయ పండితుల ద్వారా తెలుసుకున్నారు. గోదావరి తీరం ఎంతో పవిత్రమైనదని స్వామీజీలు అన్నారు. గోదావరి పవిత్రతను కాపాడుకోవాలంటే పరిశుభ్రత చాలా అవసరమని ఈ సందర్భంగా స్వామీజీలు స్పష్టం చేశారు. మహారాష్ట్ర, ఒడిస్సా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వామీజీలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. పాదగయ ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఆలయ మర్యాదలు చేశారు. స్వామీజీలతో పాటు మరో 400 మంది ఉత్తరాది భక్తులు పర్యటనలో ఆలయాలను సందర్శించారు.

Next Story