పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

by Thanuru Gopichand |   (  Updated:2025-11-15 14:43:45  IST  )

ప్రతిఒక్కరూ పరిశుభ్రతకు (Hygeine) ప్రాధాన్యం ఇవ్వాలని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (MLA Adireddy Srinivas) అన్నారు.

పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతిఒక్కరూ పరిశుభ్రతకు (Hygeine) ప్రాధాన్యం ఇవ్వాలని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (MLA Adireddy Srinivas) అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమండ్రిలోని (Rajahmundry) జీ అండ్ టీ రోడ్డులో పరిశుభ్రత ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈట్ స్ట్రీట్ వద్ద శనివారం నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ప్రదర్శనలో చిత్రాలను ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్య సంరక్షణకు ఎంతో ముఖ్యమన్నారు. అందులోనూ చేతులను మరింత పరిశుభ్రంగా (Clean Hands) ఉంచుకోవాలన్నారు. తద్వారా 80శాతం వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రతి నెల మూడో శనివారాన్ని ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandra Babu Naidu) కృషి చేస్తున్నారని తెలియజేశారు.

Next Story