- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారి మిస్సింగ్ కేసు: ఆ రోజు అసలు అడవిలోకే వెళ్లని పెంపుడు కుక్క
తూర్పుగోదావరి జిల్లా తునిలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చిన్నారి జాహ్నవితో కలిసి పెంపుడు కుక్క అడవిలోకి వెళ్లిందని, ఆ తర్వాత నాలుగు రోజులకు తిరిగి వచ్చిందని అంతా భావించారు...

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) తుని(Tuni)లో చిన్నారి జాహ్నవి మిస్సింగ్(Little Jahnavi Missing) అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చిన్నారి జాహ్నవితో కలిసి పెంపుడు కుక్క(Pet dog) అడవిలోకి వెళ్లిందని, ఆ తర్వాత నాలుగు రోజులకు తిరిగి వచ్చిందని అంతా భావించారు. కుక్కు ద్వారా చిన్నారి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. కానీ కుక్క చనిపోవడంతో కేసు సందిగ్ధంలో పడింది. అయినప్పటికీ పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు.
అసలు అడవిలోకే వెళ్లని కుక్క
అయితే జాహ్నవి తప్పిపోయిన రోజు పెంపుడు కుక్కపిల్ల అసలు అడవిలోకే వెళ్లలేదు. స్థానిక గుడి వద్ద ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్థానిక సీసీటీవీ ఫుటేజులను పరిశీలించారు. జూన్ 6న చిన్నారి జాహ్నవి మిస్సయిన కొద్దిసేపటికే కుక్కపిల్ల ఒంటరిగా గుడి వద్ద తిరుగుతూ కెమెరాకు చిక్కిన విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ కేసు మరింత సస్పెన్స్‌గా మారింది. ‘‘కుక్కతో పాటే జాహ్నవి అటువైపు వచ్చిందా?, లేక దారి తప్పిందా?’’ అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దీంతో ఈ కేసు మరో కొత్త మలుపు తిరిగింది.






