- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నవరం దేవస్థానానికి కొత్త ట్రస్ట్ బోర్డు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ జిల్లా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి కొత్త ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం నియమించింది....

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ జిల్లా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి కొత్త ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ జీ.ఓ.ఆర్.టి.నం.561ను శుక్రవారం జారీ చేసింది. చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోవ్మెంట్స్ చట్టం ప్రకారం ఈ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు ఇనుగంటి వెంకట రోహిత్‌ను చైర్మన్‌గా నియమించగా మొత్తం 16 మందిని సభ్యులుగా నియమించారు.
సభ్యులుగా రవిపాటి సత్యనారాయణ, పార్వత సూర్యరావు, పాలచర్ల నాగేంద్రబాబు, అప్పారావు తుము, సూర్యభాస్కరం దానేకుల, హెచ్.రామాంజనేయులు, తేళ్లకుల అనాథమ్మ, గెడ్డం అప్పారావు (బుజ్జి), గోదేటి భగవతి, రెడ్డి ఎరుకమ్మ, ఇముడుగపల్లి లోవకుమారి, యారగటపు బాబ్జి, బండి లక్ష్మి, లోలేటి సిరీష, కమార్సు చిరంజీవి రావు, ఝాన్సీలక్ష్మి తులిమిల్లి ఉన్నారు. దేవస్థానంలోని సీనియర్ ప్రధాన అర్చకుడు ఎక్స్-ఆఫిషియో సభ్యుడిగా కొనసాగుతారు. ట్రస్ట్ బోర్డు పదవీకాలాన్ని రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు. నియమితులైన సభ్యులకు ప్రమాణ స్వీకారం నిర్వహించేందుకు ఎండోవ్మెంట్స్ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.






