- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన వంతెన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
స్థానిక జిల్లా కేంద్రంలో వాహనాల రాకపోకల రద్దీని నియంత్రించేందుకు యుద్ధ ప్రాతిపదికన నడిపూడి, ఈదరపల్లి వద్ద నూతన వంతెనల నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ రహదారులు భవనాల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు.

దిశ, అమలాపురం: స్థానిక జిల్లా కేంద్రంలో వాహనాల రాకపోకల రద్దీని నియంత్రించేందుకు యుద్ధ ప్రాతిపదికన నడిపూడి, ఈదరపల్లి వద్ద నూతన వంతెనల నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ రహదారులు భవనాల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిధిలోని నడిపూడి లాకు వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పను లను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల నిర్వహణ తీరుతెన్నులను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ నిర్దేశిత నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్మాణ పనులలో ఎటువంటి జాప్యానికి తావివ్వరాదని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత కాల వ్యవధిలో నిర్మాణ పనులను పూర్తి చేస్తూ, ఈ వసతులను జిల్లా వాసులకు అందుబాటులోకి తీసుకుని వస్తూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించాలని ఇంజనీర్లను సూచించారు. ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ బి. రాము డివిజనల్ ఇంజనీర్ వర్మ జూనియర్ ఇంజనీర్ రమేష్ స్థానిక తహసీల్దార్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






