- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Mahanadu2023: పెద్దిరెడ్డి నుంచి పెద్దారెడ్డి వరకూ నారా లోకేశ్ మాస్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ఎవర్నీ వదిలిపెట్టనని నారా లోకేశ్ హెచ్చరించారు. అమెరికాలో ఉన్నా అమలాపురంలో ఉన్నా తీసుకొచ్చి లోపల పడేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రతి టీడీపీ కార్యకర్తను తన గుండెల్లో పెట్టుకుంటామని చెప్పారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని సైకో జగన్ తీవ్రంగా ప్రయత్నించారని మండిపడ్డారు. తన మైక్‌ను, కుర్చీని కూడా లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. సాగనిస్తే పాదయాత్ర చేస్తానని... లేదంటే దండయాత్రేనని హెచ్చరించారు.
పెద్దిరెడ్డి నుంచి పెద్దారెడ్డి వరకూ తన పాదయాత్రను అడ్డుకుంటామని ఛాలెంజ్ చేశారని లోకేశ్ తెలిపారు. ‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు, ఎవరొస్తారో రండి.. తగ్గేదేలేదు.’ అని వారికి వార్నింగ్ ఇచ్చానని చెప్పారు. దెబ్బతో పిల్లిలాగా తోక ముడుచుకుని పారిపోయారని లోకేశ్ ఎద్దేవా చేశారు. సైకోను ప్యాలెస్‌లో పెట్టి శాశ్వతంగా తాళాలు వేద్దామన్నారు. 100 ఏళ్లు అయినా.. 1000 ఏళ్లు అయినా లెజెండ్ మాత్రం ఎన్టీఆరేనని కొనియాడారు. చరిత్ర రాయాలన్నా.. తిరగ రాయలన్నా అది ఎన్టీఆర్ వల్లే అవుతుందని నారా లోకేశ్ పేర్కొన్నారు.
Also Read..
Mahanadu: రంగులు బాగా వేస్తారు... సీఎం జగన్‌పై లోకేశ్ సెటైర్స్
TDP Mahanadu: పదుల సంఖ్యలో సొమ్మసిల్లి పడిపోతున్న టీడీపీ కార్యకర్తలు